![]() |

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ అయ్యింది. ఇక బోనాల పండగ స్పెషల్ గా తీసుకురాబోతున్నారు ఈ ఎపిసోడ్ ని. ఇందులో ఎల్లమ్మ తల్లి ముందర రోలు, రోకలి పూజ చేసి పెట్టారు. ఇక బుల్లితెర మీద ఉన్న వాళ్లంతా వాళ్ళ కోరికలు కోరుకుని రోకలిని ఆ రోట్లో నిలబెట్టారు. అసలు ఎవరెవరి గురించి ఎవరెవరు ఎం కోరుకున్నారో చూద్దాం... నాటీ నరేష్ వచ్చి "రష్మీ నా లవ్ ని ఎప్పటికైనా యాక్సెప్ట్ చేయాలి " అని కోరుకున్నాడు కానీ ఆ రోకలి కాసేపు కూడా రోట్లో నిలబడలేదు. "దేవుడా నా కోరిక నెరవేరేట్టు చూడు " అన్నా కూడా ఆ రోకలి నిలబడలేదు.
.webp)
తర్వాత ఆటో రాంప్రసాద్ వచ్చి రోకలిని నిలబెట్టాడు అది నిలబడింది కానీ ఏమీ కోరుకోలేదు అని చెప్పాడు. ఇక జోర్దార్ సుజాత వచ్చి "నా బిడ్డ నా జీవితంలోకి వచ్చాక పెద్దగా నాకంటూ ఏమీ కోరికలు లేవు. నా బిడ్డను చల్లగా చూస్తే చాలు " అని కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే శివజ్యోతి కూడా వచ్చింది. "వెన్నెలకు మా ఆయన లాంటి మంచి మొగుడు మంచి ఫామిలీ వచ్చేదాకా మేమిద్దరం ఉండాలి మాకేం కాకూడదు" అని కన్నీళ్లు పెట్టుకుని మొక్కుకుంది. శివజ్యోతి- గంగూలీ కలిసి రోకలిని నిలబెట్టారు.
తర్వాత రష్మీ కూడా తన కోరికను చెప్పింది. "చాలా టాలెంట్ ఉన్న డాన్సర్ పండు మాష్టర్. అతను త్వరగా కోలుకోవాలి. అతనికి అతి ఇష్టమైన డాన్స్ పెర్ఫార్మ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఖుషి అనే చిన్నారి చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ కి శివజ్యోతి ఎమోషనల్ అయ్యింది. "నేను ఖుషిని హగ్ చేసుకోలేదు. నేను నా గర్భసంచిని హగ్ చేసుకున్నాను. నేను దాన్ని నమ్మాను. నాలా తల్లి కావాలి అనుకునేవాళ్ళందరికీ చెప్తున్నా మీకు ఒక టైం వస్తుంది. నిజ్జం చెప్తున్నా" అని చెప్పింది. మరో వైపు జోర్దార్ సుజాత కూడా ఆ మాటలకు కన్నీళ్లు పెట్టుకుంది
![]() |